యెన్నికలూ......కొన్ని 'వుప.....'లూ
"రాజుగారివీ, నావీ కలిపి వెయ్యి ఆవులు" అన్నాట్ట వెనకటికి ఓ 'గో' 'పాల' మిత్రుడు! ఆరా తీస్తే చెప్పాడట, "ఆయనవి 999, నా గుడ్డి ఆవు వొకటీ" అని! ముగ్గురు ముసలి మూర్ఖులు ఇంకా నోరు విప్పినట్టు లేదు కానీ, వాళ్లకన్నా కొంచెం చిన్న మూర్ఖులు, మూర్ఖిణులూ కొంతమంది ఐదింట్లో "న్నాల్లుగ్గు" రాష్ ట్రాల్లో జయకేతనం యెగరేసి, ప్రభుత్వం స్థాపించబోతున్నాం! అని ప్రకటించేశారు.
జగన్ కి కనీవినీ యెరుగని మెజారిటీ వచ్చింది--అదీ పార్లమెంట్ యెన్నికలో ఐదులక్షల నలభై అయిదు వేల చిల్లర! విజయమ్మ కి 85 వేల చిల్లర!
"ఇది మేము ముందుగా వూహించినదే!" అంటున్నారిప్పుడు.
(వీళ్లకి సిగ్గూ యెగ్గూ వుంటే వాళ్లు......వాళ్లే యెందుకవుతారు?)
మరి నెల్లాళ్లనుంచీ, వాళ్ల మంత్రులందరూ కోట్లకొద్దీ పార్టీ డబ్బూ, సొంత డబ్బూ, దొంగడబ్బూ ఖర్చుపెడుతూ యేమి పీకారో?
ముందుగా ప్రజలతో సంబంధంలేని (అధిష్టానం చేత రుద్దబడిన) మన ప్రజా ముఖ్యమంత్రి పదవికి మూడుతుంది....జగన్ నుంచో, టీడీపీ నుంచో కాదు.....అహ్మద్ పటేల్, గులాం నబీ, వీరప్ప మొయిలీ, రాహుల్, సోనియా ల నుంచి!
ఇంక కేంద్రంలో, యూపీయేకి క్రొత్తరకం కష్టాలు పుట్టుకొస్తాయి.....మింగలేరు, కక్కలేరు.....కరుణా వాళ్లని వెళ్లగొట్టలేరు, వుంచుకోలేరు!
కమీనిష్టోళ్లయితే, మళ్లీ యూపీయేలో చేరినా చేరవచ్చు......"అవినీతిగురించి ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఆమోదించినందుకు" అనే వంకకాని డొంకతో!
జగన్ కి నా సలహా వొక్కటే.....కుంభస్థలాన్ని కొట్టు....నీకు మంత్రి కావాలంటే, "ఢిల్లీ సుల్తాన్, పట్టుకుపోతాన్...." అనడానికి సిధ్ధంగా వున్న "యుగంధరులు" సిధ్ధంగా వున్నారు! అని.
సరేగానీ, "భారతీయుడిగా జన్మించినందుకు సిగ్గుపడుతున్నాను" (ఇటలీ అమ్మకి పుట్టినందుకు గర్విస్తున్నాను, భారతీయుడు 'కాని' తండ్రికి పుట్టనందుకు చింతిస్తున్నాను.......అన్నాడో, అనుకున్నాడో తెలీదు) అన్నవాణ్ణి భారతీయులెలా సహిస్తారో చూడాలి. ఆవేశంలో అన్నాను అనో, మీడియా వారు వక్రీకరించారు అనో బుకాయించడం కూడా చెయ్యలేదు ఇప్పటివరకూ వాడు.
నిన్నటివరకూ, 2014 లో వాణ్ణి ప్రథానమంత్రిని చెయ్యడమే మా ధ్యేయం అన్నవాళ్లు ఇవాళ నుంచి యే మొహం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతారో మరి?
అసలు వాడు రాష్ట్ర ప్రభుత్వం కళ్లుగప్పి, భద్రతా నియమాలని వుల్లంఘించి, అక్కడకి వెళ్లడం యెందుకూ, ధర్ణా పేరుతో అరెష్ట్ చేయించుకోడం యెందుకూ, మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం వాణ్ణి బెయిలుపై విడుదల చేయించి, "పటిష్ట భద్రతతో" ఢిల్లీ పంపించడం యెందుకూ? ఇంతకన్నా చౌకబారు రాజకీయం వాడికెవరూ నేర్పలేదేమో మరి!
ఈలోపల వాణ్ని యే ముజాహిదీన్ వాడో వేసేస్తె, "దేశం కోసం 'నిస్వార్థంగా' త్యాగం చేసిన గాంధీ-నెహ్రూ కుటుంబం నాలుగోనో, ఐదోనో తరం వ్యక్తి" అని పోస్టర్లు వేసేసి, 2014 లో యే ప్రియాంక కొడుక్కో ప్రథాన మంత్రి పదవి కట్టబెట్టెయ్యొచ్చు అని వెనకున్న వాళ్ల ఆలోచనేమో! (పాపము శమించుగాక!)
యెంతబాగుందో....ఇంకెంతబాగుండబోతోందో....భారత రాజకీయం!
యెలక్షన్లయిపొయాయికాబట్టి, వుద్యమం వుధ్ధృతం చేస్తాడట.....బొర్రముక్కోడు! ఇంకో వందో, పదివేలో "ఐకాస"లు యేర్పాటు చేసుకుంటూ పోతాం....జీతాలు తీసుకొంటూ పని చెయ్యని నాలాంటి వాళ్లందరితో అంటున్నాడు కోదండోడు. (అలాంటి వాళ్లని బెదిరించడానికి వో జీవో ఇచ్చి, థూ నా బొడ్డు అన్నాడు మన ము. మం.) యాదవకులంలో ముసలంలా పుట్టాడు నాగం. అందరూ గురివెందలే మరి! ఇంక రాష్ ట్రంలో అపోజిషన్ యెవరో? కి కు రె తరవాత.....అరాచకమేనా?)
వెండితెరపై చూద్దాం!
2 comments:
>వీళ్లకి సిగ్గూ యెగ్గూ వుంటే వాళ్లు......వాళ్లే యెందుకవుతారు
akkada (dash)- kada umdalsimdi?
పై అన్నోన్!
చిన్న డేష్ పెడితే మీకు తోచిన పదం అక్కడ వాడుకోడానికి వీలుండదని గేప్ కొంచెం పెంచాను. అంతే! అలాగే వ్రాయాలని కాదు.
చాలా సంతోషం!
Post a Comment