Monday, December 11, 2017

జాతి ద్రోహులూ……. - 6




……..అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!



(వాళ్లకి అదే పని! …….తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు. ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలసిందల్లా--కొంతమంది మూర్ఖులైనా వాళ్లు వ్రాసినవి నమ్మకపోతారా, మరింత ప్రచారం చెయ్యకపోతారా…....అన్న వాళ్ల ఆశ ఒక్కటే!)

గొప్ప ఆర్థిక వేత్తా, సంస్కరణలకి అద్యుడూ, మౌన ముని అంటూ పొగిడించుకున్న మాజీ ప్రథాని, నోట్ల రద్దు విషయం లో "వ్యస్థీకృత దోపిడీ" లాంటి మాటలు మాట్లాడడం తో సగం గౌరవం పోగొట్టుకున్నాడు!

ఇప్పుడు, పూర్తిగా పోగొట్టుకోడానికి, "అక్కడ గుజరాత్ ఎన్నికలగురించి మాట్లాడలేదు" అంటున్నాడు!

తాడి చెట్టు క్రింద కూర్చోవడం ఎందుకు? పాలో, ఇంకేవో త్రాగడం ఎందుకు? అదీ, కల్లు త్రాగేవాళ్ల సమక్షం లో  చేయడం ఎందుకు?

ఒక మాజీ ప్రథానిగా నీకు కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని బాధ్యతలు ఉన్నాయి.

అధికారికంగా మనదేశానికి వచ్చిన పాకీ అధికారులతో (వాళ్లు అధికారికంగా కాకుండా వస్తే, వాళ్ల తోలు తీస్తుంది వాళ్ల ప్రభుత్వం!) మంతనాలు ఎందుకు చెయ్యవలసి వచ్చింది? అదీ, ప్రొటోకాల్ పాటించకుండా, మన ప్రభుత్వానికి తెలియజేయకుండా? మాజీ రాష్ట్రపతీ, మాజీ సైనిక, దౌత్య అధికారులూ వగైరాలకి పాకిస్థాన్‌ వాళ్లతో "డిన్నర్" ఇవ్వవలసిన అగత్యం మణిశంకర్ కి ఏమి పట్టింది? (నిజానికి వాడికి దేశ బహిష్కరణ విధించాలి.)

ఒక పాకీ మాజీ సైనికాధికారి, "గుజరాత్ లో అహ్మద్ పటేల్ ని ముఖ్యమంత్రిని చేయండి" అని గొరిగించుకోవడం నిజం కాదా? ఇప్పుడు పాకీ వాళ్లు, "మమ్మల్ని మీ ఎన్నికల రాజకీయాల్లోకి లాగకండి" అనడం ఏమిటి?

ఇంకా ఎంతకని దిగజారుతార్రా…….కాంగీ మూర్ఖులూ!
మాజీ ప్రథాని, మీ కానిపనులకి ముందు పెట్టుకోడానికి, చేటపెయ్యలా కూడా పనికి రాడురా…...వదిలెయ్యండి పాపం!


 (మరింత మరోసారి)

Saturday, December 9, 2017

జాతి ద్రోహులూ...... - 5


......అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!
(వాళ్లకి అదే పని! ナナ.తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు. ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలసిందల్లాナナకొంతమంది మూర్ఖులైనా వాళ్లు వ్రాసినవి నమ్మకపోతారా, మరింత ప్రచారం చెయ్యకపోతారా..అన్న వాళ్ల ఆశ ఒక్కటే!)
గుజరాత్ ఎలెక్షన్లు రేపు (0 9- 1 2- 1 7) మొదలు కాబోతున్నాయి.

ఈ మీడియా వాళ్లు-మోడీ కి వ్యతిరేకంగానే కాదు..కాంగీలకి మద్దతుగా నానా గడ్డీ కరిచారు, నానా చెత్తా వ్రాశారు!

రాజీవ్ గుజరాత్ లోని దేవాలయాలని చుట్టి వస్తుంటే, "అది అవసరమే! (కాంగీలకి) "మైనారిటీల బుజ్జగింపు" అనే మచ్చ తొలగిపోవాలంటే, తానూ హిందువులకి ఇష్టుణ్నే అని నిరూపించుకోవాలి కదా?" అంటారు!
 తీరా, సోమనాధాలయానికి వెళ్తూ, అక్కడి రిగిష్టర్ లో అతను "నాం-హిందూ" అని వ్రాశారని బయటికి వచ్చాక, "అంతులో తప్పేముంది? హిందువా కాదా వ్రాస్తే సరిపోతుంది గానీ, అసలు మతం ఎందుకు వ్రాయాలి?" అని సమర్థించారు!
 నిజంగా అతను "సెక్యులఱ్ అనిపించుకోవడం ఇష్టం లేదుナナహిందూ వోట్లు పోతాయేమో అని భయం. అలా అని "మత రహితుడు" అని చెప్పుకుంటే, మైనారిటీ వోట్లు పోతాయేమో అని భయం!
 అలా, ఏ మతమూ లేనివాడిగా, అసలు మతం చెప్పుకోలేనివాడిగాナナ.మిగిలిపోయాడు! అదే గొప్ప అని మోసేశాయి పత్రికలు!
 మరి, ప్రజాస్వామ్యం నడుస్తున్న ప్రపంచ దేశాల్లో అమల్లో ఉన్నది "మెజారిటీ ప్రజాస్వామ్యమ" మాత్రమే కదా? (మొన్న బ్రిటం లో బ్రెగzఇట్ మీద ప్రజాభిప్రాయ సేకరణలో, చాలా కొద్ది మెజారిటీతో మాత్రమే, ఈయూ నుంచి బయటికి వెళ్లాలని తీర్మానించారు!)
 మరి, మన దేశమ్లో నడిచేదీ అదే ప్రజాస్వామ్యం కదా? మెజారిటీ ప్రజలు ఎన్నుకున్న పార్టీ ప్రభుత్వమే నడుస్తుంది కదా? మరి ఆ ప్రభుత్వం, మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం నడవకూడదు అంటే ఎలా?
 నిజమేナナమైనారిటీలని మెజారిటీ అధికారానికీ, వాళ్ల అభిప్రాయాలు మైనారిటీల మీద రుద్దడానికీ వ్యతిరేకంగా వాళ్లకి కొన్ని రక్షణలు వుండాలి, వున్నాయి!
 మరి అదే సూత్రం ప్రకారం, ఏ రాష్ట్రం లో ఎవరు మెజారిటీగా వున్నారో, వాళ్లనుంచీ అక్కడి మైనారిటీలకి రక్షణ ఉండాలి కదా? అలా అనడానికి ఏడుస్తారెందుకు?
 అక్కడెక్కడో రాజస్థాం లో బెంగాలీ కూలీ ఒకణ్ని ఎవరో, ఏదో కారణం తో దహనం చేస్తే, దాన్ని అందరూ "తప్పు" అనే ఖండించారు, ఖండించాలి కూడా!
 కానీ, ఆ ఒక్క సంఘటనని, జాతీయ స్థాయి లో అతి పెద్దగా చూపిస్తూ, విషం కక్కవలసిన అవసరం ఏముందిナナ.ఈ మీడియాకీ, సో కాల్డ్ కాలమిష్టులకీ?
 దేశ ప్రజలందరూ సమానమే..అందులో జర్నలిస్టులు కొంచెం ఎక్కువ సమానమナナవాళ్లలో కూడా ఈ సో కాల్డ్ "లిబెరల్" జర్నలిస్టులుナナమరింత ఎక్కువ సమానం (ట.)
 ఆసలు వీళ్లు, కాంగ్రెస్ ఏమి చేస్తే బలపడుతుంది, ఎమి చేస్తే ఎక్కువ వోట్లు సంపాదిస్తుందీ, ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే బాగుపడుతుంది, ఆ అధ్యక్షుడూ, వాడి తైనాతీలు ఏమి చేస్తే పార్టీకి మంచిదిナナ.అంటూ ఉచిత సలహాలు పత్రికలనిండా ఎందుకు నింపుతారో?
 నిజమే, బలమైన ప్రతి పక్షం అవసరమే! దానికి ఓ అర్హత వుండాలికదా? అలాంటి అర్హత కోల్పోయి, అయినా బుధ్ధి తెచ్చుకోకుండా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ నే ఇంకా పట్టుకుని వ్రేళ్లాడాలనుకునే ఇలాంటి వాళ్లని, వుంటే గింటే, ఆ దేవుడే రక్షించాలి!
 నాకు ఇలాంటి మీడియానీ, జర్నలిస్టులనీ తలుచుకుంటే, జాలీ.ఇంకోటీ కలుగుతున్నాయి! అంతకంటే ఏమి చెయ్యగలను!

(మరింత మరోసారి)

Thursday, December 7, 2017

జాతి ద్రోహులూ……. – 4


……….అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!

(వాళ్లకి అదే పని! …….తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు. ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలసిందల్లా……కొంతమంది మూర్ఖులైనా వాళ్లు వ్రాసినవి నమ్మకపోతారా, మరింత ప్రచారం చెయ్యకపోతారా…..అన్న వాళ్ల ఆశ ఒక్కటే!)

……..ఇంక, "కపిల్ సిబల్" వ్యవహారానికొస్తే, మనీ లాండరింగ్ లో అనేక సూట్ కేస్ కంపెనీలు స్థాపించినట్టూ, రాజూ, ఏడుగురు కొడుకులూ లాగానూ, కథ చాలా దూరం వెళుతోంది!

అసలు, కోర్టులో వాదనలు మొదలయ్యే ముందు, వాది ప్రతివాదుల తరఫున న్యాయవాదులు తమకి ఇవ్వబడిన “వకాలత్ నామా” దాఖలు చేస్తారు. అంటే, ఫలానా వాదో, ప్రతివాదో, వారి తరఫున వాదించమని తమని నియమించారు అని ధృవీకరించే పత్రం.

మరి, ఏ వకాలత్ నామా కూడా లేకుండా కపిల్ సిబల్ వాదించాడా? అనేది ఓ లక్షకోట్ల రూపాయల ప్రశ్న!

మీడియా వాళ్లే మొదట “కపిల్ సిబల్ ‘సున్నీ వక్‌ఫ్ బోర్డు’ తరఫున వాదిస్తూ…….” అని ప్రకటించారు.

మోడీ, “వక్‌ఫ్ బోర్‌డ్ కీ ఎలక్షన్ కీ ఏమిటి సంబంధం? కాంగీ వాళ్లకి గానీ…..” అనగానే, కాంగీ వాళ్లు ప్రకటించేశారు……"వాడి వాదనకీ, తమ పార్టీ కీ సంబంధం లేదు" అని.

వెంటనే, వక్‌ఫ్ బోర్‌డ్ వాళ్లు…..”కపిల్ సిబల్ మా అడ్వొకేట్ ఆన్ రికార్‌డ్ (అంటే వకాలత్ నామా ఇవ్వబడ్డ న్యాయవాది) కాదు. అది 'షాహిద్ హుస్సేన్ రిజ్వీ' అనే ఆయన మాత్రమే!” అని ప్రకటించారు. ఇంకా, “ఆయన మరెవరో ప్రైవేటు పార్టీ తరఫున వాదించాడు. ముస్లిం ల తరఫున ఏ లాయరూ అలా వాదించడు!” అని ప్రకటించారు.

కపిల్ నాలిక కొరుక్కోకుండా, “మోడీ తప్పుగా మాట్లాడాడు! నేను ఇక్బాల్ అన్సారీ అనే ప్రైవేటు వ్యక్తి తరఫున మాట్లాడాను” అన్నాడు నిస్సిగ్గుగా!

ఈ ఇక్బాల్ అన్సారీ అనేవాడు, “మొదటిగా కేసులో వాది గా వుండిన హషీం అన్సారీ కొడుకు” అని కూడా చెప్పాడు.

ఇక్బాల్ అన్సారీ, “కపిల్ సిబల్ కి మేము ఎవరూ ‘అలా’ వాదించమని చెప్పలేదు. ఆయన ఏ ప్రైవెట్ పార్టీల తరఫునా కూడా వాదించడానికి నియమించబడలేదు. బహుశా, ఎవరో ప్రైవెట్ పార్టీ వాళ్ల లాయర్లు, ఆయన ని తమ క్రింద వాదించడానికి నియమించుకున్నారేమో……!” అని సందేహం వెలిబుచ్చాడు.

మరి కపిల్ సిబలూ, కాంగీ వాళ్లూ, తమ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో?

ఏ సుప్రీం కోర్టు వారో, వాడి వకాలత్ ఇంకా వాదనల హవాలా తరహా వ్యవహారం పై దర్యాప్తు చేయించి, నిజాలు బయటికి వచ్చేలా చేస్తారా?

(నేను వ్రాసిన వాటన్నింటికీ, TIMES OF INDIA కథనాలే మూలం.)

(మరింత మరోసారి)

జాతి ద్రోహులూ……. – 3


……….అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!

(వాళ్లకి అదే పని! …….తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు. ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలసిందల్లా……కొంతమంది మూర్ఖులైనా వాళ్లు వ్రాసినవి నమ్మకపోతారా, మరింత ప్రచారం చెయ్యకపోతారా…..అన్న వాళ్ల ఆశ ఒక్కటే!)

……..ఇంక, నిన్న బాబ్రీ మసీదు కూల్చివేత వార్షిక దినం. పైగా ఇది 25 వది అట! అందుకని దానికి ఘనంగా “రజతోత్సవం” అని ఈ పత్రికల వ్యవహారం!

ఇంక, అదేరోజు అంబేడ్కర్ పుట్టిన రోజో ఏదోట.

రెండింటికీ లింకు పెట్టి, వీళ్లంటారూ……”పాత విషయాలు అన్నీ మరిచిపోదాం…..” అని రాజ్యాంగంలో వ్రాసుకున్నాము ట. అందుకని, 1949 నుంచీ 1992 వరకూ జరిగిన విషయాలు మరిచిపోయి, మసీదు అక్కడే కట్టేసి, రాముడి గుడి బయటెక్కడో కట్టుకోవాలిట! ఇంకొందరు ప్రబుధ్ధులైతే, అక్కడ ఒక ఎమ్యూజ్మెంట్ పార్కో, థియేటరో కట్టాలట!

మరి, 1992 నుంచీ, 2010 వరకూ జరిగినవీ (అలహాబాద్ కోర్టు తీర్పూ…..) కూడా మరిచి పోవాలా? పోనీ, 2010 నుంచీ ఇప్పటివరకూ వీళ్లు జరుపుతున్న వార్షికోత్సవాలు మరిచిపోవాలా?

అసలు, మరిచిపోవడం అంటూ వస్తే, బాబర్ దండయాత్రా, ఆలయాన్ని కూలగొట్టి మసీదు నిర్మించడం వరకూ కూడా యెందుకు మరిచిపోకూడదు??? "మసీదు కట్టక ముందు అక్కడ రామాలయం ఉండేది" అని పురావస్తు శాఖ సమర్పించిన సాక్ష్యాధారాలు సుప్రీం కోర్టు దగ్గర వున్నాయి కదా మరి?

అవన్నీ వీళ్లకి అఖ్ఖరలేదు……రొడ్డకొట్టుడే వాళ్ల వ్యవహారం! 

దీనికి తోడు, ఒకరోజు ముందు సుప్రీం కోర్టులో, ఇదివరకే ప్రకటించినట్టే, రోజువారీ విచారణ ప్రారంభం అయ్యింది.
ఆసలు సుప్రీం కోర్టు ఆ రోజుకి కేసు వాయిదా వేసింది, “……ఇక ముందు యే విధమైన వాయిదాలూ అనుమతించకుండా, రోజువారీ విచారణ సాగిస్తాము……” అని చెప్పి మరీ!

మరి, తెలెవిమాలిన "కపిల్ సిబల్" వాదన చూడండి……”జులై 19, 2019 సంవత్సరం వరకూ కేసు వాయిదా వేయాలి” ట.

దానికి వాడు చెప్పిన కారణాలు……ముఖ్యమైనవి రెండు. 1. 2010 నుంచీ ఇప్పటిదాకా లేని ‘తొందర’ ఇప్పుడు ఎందుకు? 2. బీజేపీ వాళ్ల మేనిఫెస్టో లో, రామమందిరం నిర్మిస్తాము అని చెప్పారు. ఇప్పుడు రామ మందిరం నిర్మించేస్తే, 2019 లో బీజేపీ వాళ్లే గెలుస్తారు. (ఎవరు గెలిస్తే ఏమిటో వీడి బాధ? అవీ బయటికి వచ్చాయి……ఆ మర్నాడే! అది కూడా విచారణ చేయిస్తే “మనీ లాండరింగ్ కుంభకోణం" అంత విలువైన విషయాలు వెలికి వస్తాయేమో! ఈ విషయం గురించి తరువాత వ్రాస్తాను.)

1. కంగారెందుకు?......అన్నదానికి కోర్టే జవాబు చెప్పింది. “అప్పట్లో కేసు విచారణ 90 రోజులు మాత్రమే జరిగి ముగిసింది. ఆ ఆలస్యానికి కూడా కారణం, ఆ పార్టీలు ఏవో కారణాలతో వాయిదాలు కోరుతూ రావడమే” అనీ, “ఇప్పుడు పధ్ధతిప్రకారమే జురుగుతోంది కదా, ఇందులో తొందర ఏముంది?” అని అడిగింది!  

మరి, తొందర విషయానికొస్తే, 1949 నుంచీ ఆ ప్రభుత్వాలు నానబెట్టడం ద్వారానే కదా ముడులు బిగిశాయి?
అప్పట్లో, యెలక్షన్ ల ముందు, శిలాన్యాసం చేసి, రాజీవ్ ఎందుకు తొందర పడ్డాడు?

మసీదు కూల్చివేత తరువాత, పీవీ నరసింహారావు ని ఎందుకు హింసించారు? ఆయన సమాధికి కూడా ఢిల్లీలో స్థానం లేకుండా ఎందుకు చేశారు? అప్పటి నుంచీ కమిషన్లు వేసీ, కేసులు ఎందుకు దాఖలు చేయించారు? అవన్నీ ‘తొందర’ లేకుండానే చేయించారా? ఇప్పుడు తొందరేమొచ్చింది అని యే ముఖం పెట్టుకొని అడుగుతున్నారు?

2. “……వాళ్లు మందిరం కట్టేస్తే,…….వాళ్లే గెలుస్తారు!” అన్నది ఎంత మూర్ఖ వాదన!! వీళ్లకి కావలసింది సమస్య పరిష్కారం, జనం సుఖంగా జీవించడం కాదు! ఎలక్షన్ లలో వాళ్ల పార్టీ తప్ప ఇంకెవరూ గెలవకూడదు! వాళ్ల పిచ్చి పిచ్చి వ్యవహారాలూ, కుంభకోణాలే కొనసాగాలి!

ఉదాహరణకి, రేపు కాంగీలు తమ మేనిఫెస్టో లో, “2024 లోపల దేశం నుంచి దారిద్ర్యాన్ని పారద్రోలతాం” అని పెడితే, నాలాంటి వాడెవడో, “వాళ్లు తీసుకునే చర్యలేమిటో చెప్పకుండా, ఈ విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టడం రాజ్యాంగ విరుధ్ధం” అని కోర్టు కి వెళితే, “దాని మీద విచారణని 2024 వరకూ సాగించవద్దు. ఈ లోగా వాళ్లు నిజంగా పారద్రోలేస్తే, 2024 లో మళ్లీ వాళ్లే గెలిచేస్తారు” అని ఇంకో పార్టీ వాళ్లు వాదిస్తే……????

ఇలాంటివి మూర్ఖపు వాదనలు అనడానికి ఇంకేమైనా దృష్టాంతం కావాలా?

(మరింత మరోసారి)

Wednesday, December 6, 2017

జాతి ద్రోహులూ……. – 2


……….అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!

(వాళ్లకి అదే పని! …….తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు. ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలసిందల్లా……కొంతమంది మూర్ఖులైనా వాళ్లు వ్రాసినవి నమ్మకపోతారా, మరింత ప్రచారం చెయ్యకపోతారా…..అన్న వాళ్ల ఆశ ఒక్కటే!)

సార్వత్రిక యెన్నికలకి ఇంకా 18 నెలలు పైగా సమయం ఉంది. వస్తున్నవి గుజరాత్, తరువాత కర్ణాటక వగైరా యెన్నికలు.
అయినా, అప్పుడే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టేశారు…..బీ జే పీ కీ, మోడీ కీ వ్యతిరేకంగా, ఈ మీడియా వాళ్లూ, వాట్సాప్, ఇతర మీడియాల్లో వాళ్ల తైనాతీలూ!

ఢిల్లీలో కూర్చొని వ్రాస్తున్నారు…..వె.ధ.వ.లూ, …..డలూ…..(వాళ్లని తిట్టడానికి అంతకంటే పెద్ద తిట్లు రావు నాకు. ఇంకో తిట్టు వచ్చుగానీ, అనవసరంగా వాళ్ల అమ్మలకి తగులుతుంది అది.) “……(బీజేపీ) వాళ్లకి గట్టిగా పాఠం చెప్పాలి…..” లాంటి నినాదాలు వినపడుతున్నాయి (ట)! వాళ్లూ గుజరాత్ వెళ్లలేదు, నేనూ వెళ్లలేదు. కానీ, అది ఎంతనిజమో, వాళ్ల కొసమెరుపు వ్రాత చెపుతోంది…..”కానీ, ఆ నినాదం గుజరాత్ అంతటా వినపడడం లేదు" (ట)!

ఇంక, పటీదార్లు అంటే అభిమానం పెరిగిపోతోందిట జనాలకి! వాడెవడో హార్దిక్ పటేల్ అనేవాడు, ఓ సారి హటాత్తుగా ఆందోళన మొదలెట్టేశాడు ఇంతకు ముందు……కోట్ల రూపాయలతో! తరువాత ఏమైందో నోరుమూసుకు కూర్చున్నాడు. ఇప్పుడు వాడు సిగ్గులేని పార్టీకి మద్దతు!

ఆసలు ఈ పటీదార్లు అందరూ బాగా ధనవంతులు అన్న సంగతి అందరికీ తెలుసు. వాళ్లకి రిజర్వేషన్ లు కావాలట. పోనీ, అందరూ కాదు, వాళ్లలోనూ పేదలు ఉన్నారు అనుకున్నా, వాళ్లకి ఆ ధనవంతులైన మెజారిటీ సహాయం చెయ్యవచ్చుకదా? మొత్తం కులం పేరుతో రిజర్వేషన్ ఎందుకు? వేషం కాకపోతే!

(అన్నట్టు……సిక్కుల్లో ఎవరినైనా “అడుక్కునే వాళ్లని” చూశారా? అని గర్వంగా ప్రశ్నించి, “లేదు” అని మనచేతే సమాధానం చెప్పిస్తారు వాళ్లు. నిజంగా ఎవరూ సిక్కుమతస్తులు అడుక్కోవడం చూడలేదు! ఆ అవసరం వాళ్లకి రాకుండా చూసుకుంటారు మిగతా ఆ మతానికి చెందినవాళ్లు. అది, అన్ని మతాల, కులాల వాళ్లకీ ఆచరణీయం.)

(మరింత మరోసారి)