Monday, December 11, 2017

జాతి ద్రోహులూ……. - 6




……..అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!



(వాళ్లకి అదే పని! …….తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు. ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలసిందల్లా--కొంతమంది మూర్ఖులైనా వాళ్లు వ్రాసినవి నమ్మకపోతారా, మరింత ప్రచారం చెయ్యకపోతారా…....అన్న వాళ్ల ఆశ ఒక్కటే!)

గొప్ప ఆర్థిక వేత్తా, సంస్కరణలకి అద్యుడూ, మౌన ముని అంటూ పొగిడించుకున్న మాజీ ప్రథాని, నోట్ల రద్దు విషయం లో "వ్యస్థీకృత దోపిడీ" లాంటి మాటలు మాట్లాడడం తో సగం గౌరవం పోగొట్టుకున్నాడు!

ఇప్పుడు, పూర్తిగా పోగొట్టుకోడానికి, "అక్కడ గుజరాత్ ఎన్నికలగురించి మాట్లాడలేదు" అంటున్నాడు!

తాడి చెట్టు క్రింద కూర్చోవడం ఎందుకు? పాలో, ఇంకేవో త్రాగడం ఎందుకు? అదీ, కల్లు త్రాగేవాళ్ల సమక్షం లో  చేయడం ఎందుకు?

ఒక మాజీ ప్రథానిగా నీకు కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని బాధ్యతలు ఉన్నాయి.

అధికారికంగా మనదేశానికి వచ్చిన పాకీ అధికారులతో (వాళ్లు అధికారికంగా కాకుండా వస్తే, వాళ్ల తోలు తీస్తుంది వాళ్ల ప్రభుత్వం!) మంతనాలు ఎందుకు చెయ్యవలసి వచ్చింది? అదీ, ప్రొటోకాల్ పాటించకుండా, మన ప్రభుత్వానికి తెలియజేయకుండా? మాజీ రాష్ట్రపతీ, మాజీ సైనిక, దౌత్య అధికారులూ వగైరాలకి పాకిస్థాన్‌ వాళ్లతో "డిన్నర్" ఇవ్వవలసిన అగత్యం మణిశంకర్ కి ఏమి పట్టింది? (నిజానికి వాడికి దేశ బహిష్కరణ విధించాలి.)

ఒక పాకీ మాజీ సైనికాధికారి, "గుజరాత్ లో అహ్మద్ పటేల్ ని ముఖ్యమంత్రిని చేయండి" అని గొరిగించుకోవడం నిజం కాదా? ఇప్పుడు పాకీ వాళ్లు, "మమ్మల్ని మీ ఎన్నికల రాజకీయాల్లోకి లాగకండి" అనడం ఏమిటి?

ఇంకా ఎంతకని దిగజారుతార్రా…….కాంగీ మూర్ఖులూ!
మాజీ ప్రథాని, మీ కానిపనులకి ముందు పెట్టుకోడానికి, చేటపెయ్యలా కూడా పనికి రాడురా…...వదిలెయ్యండి పాపం!


 (మరింత మరోసారి)

2 comments:

Anonymous said...

Congress is not ashamed of its deeds.

A K Sastry said...

@Anonymous

It will never be! It is for its supporters to be ashamed of the Party.