Thursday, December 7, 2017

జాతి ద్రోహులూ……. – 4


……….అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!

(వాళ్లకి అదే పని! …….తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు. ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలసిందల్లా……కొంతమంది మూర్ఖులైనా వాళ్లు వ్రాసినవి నమ్మకపోతారా, మరింత ప్రచారం చెయ్యకపోతారా…..అన్న వాళ్ల ఆశ ఒక్కటే!)

……..ఇంక, "కపిల్ సిబల్" వ్యవహారానికొస్తే, మనీ లాండరింగ్ లో అనేక సూట్ కేస్ కంపెనీలు స్థాపించినట్టూ, రాజూ, ఏడుగురు కొడుకులూ లాగానూ, కథ చాలా దూరం వెళుతోంది!

అసలు, కోర్టులో వాదనలు మొదలయ్యే ముందు, వాది ప్రతివాదుల తరఫున న్యాయవాదులు తమకి ఇవ్వబడిన “వకాలత్ నామా” దాఖలు చేస్తారు. అంటే, ఫలానా వాదో, ప్రతివాదో, వారి తరఫున వాదించమని తమని నియమించారు అని ధృవీకరించే పత్రం.

మరి, ఏ వకాలత్ నామా కూడా లేకుండా కపిల్ సిబల్ వాదించాడా? అనేది ఓ లక్షకోట్ల రూపాయల ప్రశ్న!

మీడియా వాళ్లే మొదట “కపిల్ సిబల్ ‘సున్నీ వక్‌ఫ్ బోర్డు’ తరఫున వాదిస్తూ…….” అని ప్రకటించారు.

మోడీ, “వక్‌ఫ్ బోర్‌డ్ కీ ఎలక్షన్ కీ ఏమిటి సంబంధం? కాంగీ వాళ్లకి గానీ…..” అనగానే, కాంగీ వాళ్లు ప్రకటించేశారు……"వాడి వాదనకీ, తమ పార్టీ కీ సంబంధం లేదు" అని.

వెంటనే, వక్‌ఫ్ బోర్‌డ్ వాళ్లు…..”కపిల్ సిబల్ మా అడ్వొకేట్ ఆన్ రికార్‌డ్ (అంటే వకాలత్ నామా ఇవ్వబడ్డ న్యాయవాది) కాదు. అది 'షాహిద్ హుస్సేన్ రిజ్వీ' అనే ఆయన మాత్రమే!” అని ప్రకటించారు. ఇంకా, “ఆయన మరెవరో ప్రైవేటు పార్టీ తరఫున వాదించాడు. ముస్లిం ల తరఫున ఏ లాయరూ అలా వాదించడు!” అని ప్రకటించారు.

కపిల్ నాలిక కొరుక్కోకుండా, “మోడీ తప్పుగా మాట్లాడాడు! నేను ఇక్బాల్ అన్సారీ అనే ప్రైవేటు వ్యక్తి తరఫున మాట్లాడాను” అన్నాడు నిస్సిగ్గుగా!

ఈ ఇక్బాల్ అన్సారీ అనేవాడు, “మొదటిగా కేసులో వాది గా వుండిన హషీం అన్సారీ కొడుకు” అని కూడా చెప్పాడు.

ఇక్బాల్ అన్సారీ, “కపిల్ సిబల్ కి మేము ఎవరూ ‘అలా’ వాదించమని చెప్పలేదు. ఆయన ఏ ప్రైవెట్ పార్టీల తరఫునా కూడా వాదించడానికి నియమించబడలేదు. బహుశా, ఎవరో ప్రైవెట్ పార్టీ వాళ్ల లాయర్లు, ఆయన ని తమ క్రింద వాదించడానికి నియమించుకున్నారేమో……!” అని సందేహం వెలిబుచ్చాడు.

మరి కపిల్ సిబలూ, కాంగీ వాళ్లూ, తమ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో?

ఏ సుప్రీం కోర్టు వారో, వాడి వకాలత్ ఇంకా వాదనల హవాలా తరహా వ్యవహారం పై దర్యాప్తు చేయించి, నిజాలు బయటికి వచ్చేలా చేస్తారా?

(నేను వ్రాసిన వాటన్నింటికీ, TIMES OF INDIA కథనాలే మూలం.)

(మరింత మరోసారి)

No comments: