Saturday, December 9, 2017

జాతి ద్రోహులూ...... - 5


......అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!
(వాళ్లకి అదే పని! ナナ.తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు. ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలసిందల్లాナナకొంతమంది మూర్ఖులైనా వాళ్లు వ్రాసినవి నమ్మకపోతారా, మరింత ప్రచారం చెయ్యకపోతారా..అన్న వాళ్ల ఆశ ఒక్కటే!)
గుజరాత్ ఎలెక్షన్లు రేపు (0 9- 1 2- 1 7) మొదలు కాబోతున్నాయి.

ఈ మీడియా వాళ్లు-మోడీ కి వ్యతిరేకంగానే కాదు..కాంగీలకి మద్దతుగా నానా గడ్డీ కరిచారు, నానా చెత్తా వ్రాశారు!

రాజీవ్ గుజరాత్ లోని దేవాలయాలని చుట్టి వస్తుంటే, "అది అవసరమే! (కాంగీలకి) "మైనారిటీల బుజ్జగింపు" అనే మచ్చ తొలగిపోవాలంటే, తానూ హిందువులకి ఇష్టుణ్నే అని నిరూపించుకోవాలి కదా?" అంటారు!
 తీరా, సోమనాధాలయానికి వెళ్తూ, అక్కడి రిగిష్టర్ లో అతను "నాం-హిందూ" అని వ్రాశారని బయటికి వచ్చాక, "అంతులో తప్పేముంది? హిందువా కాదా వ్రాస్తే సరిపోతుంది గానీ, అసలు మతం ఎందుకు వ్రాయాలి?" అని సమర్థించారు!
 నిజంగా అతను "సెక్యులఱ్ అనిపించుకోవడం ఇష్టం లేదుナナహిందూ వోట్లు పోతాయేమో అని భయం. అలా అని "మత రహితుడు" అని చెప్పుకుంటే, మైనారిటీ వోట్లు పోతాయేమో అని భయం!
 అలా, ఏ మతమూ లేనివాడిగా, అసలు మతం చెప్పుకోలేనివాడిగాナナ.మిగిలిపోయాడు! అదే గొప్ప అని మోసేశాయి పత్రికలు!
 మరి, ప్రజాస్వామ్యం నడుస్తున్న ప్రపంచ దేశాల్లో అమల్లో ఉన్నది "మెజారిటీ ప్రజాస్వామ్యమ" మాత్రమే కదా? (మొన్న బ్రిటం లో బ్రెగzఇట్ మీద ప్రజాభిప్రాయ సేకరణలో, చాలా కొద్ది మెజారిటీతో మాత్రమే, ఈయూ నుంచి బయటికి వెళ్లాలని తీర్మానించారు!)
 మరి, మన దేశమ్లో నడిచేదీ అదే ప్రజాస్వామ్యం కదా? మెజారిటీ ప్రజలు ఎన్నుకున్న పార్టీ ప్రభుత్వమే నడుస్తుంది కదా? మరి ఆ ప్రభుత్వం, మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం నడవకూడదు అంటే ఎలా?
 నిజమేナナమైనారిటీలని మెజారిటీ అధికారానికీ, వాళ్ల అభిప్రాయాలు మైనారిటీల మీద రుద్దడానికీ వ్యతిరేకంగా వాళ్లకి కొన్ని రక్షణలు వుండాలి, వున్నాయి!
 మరి అదే సూత్రం ప్రకారం, ఏ రాష్ట్రం లో ఎవరు మెజారిటీగా వున్నారో, వాళ్లనుంచీ అక్కడి మైనారిటీలకి రక్షణ ఉండాలి కదా? అలా అనడానికి ఏడుస్తారెందుకు?
 అక్కడెక్కడో రాజస్థాం లో బెంగాలీ కూలీ ఒకణ్ని ఎవరో, ఏదో కారణం తో దహనం చేస్తే, దాన్ని అందరూ "తప్పు" అనే ఖండించారు, ఖండించాలి కూడా!
 కానీ, ఆ ఒక్క సంఘటనని, జాతీయ స్థాయి లో అతి పెద్దగా చూపిస్తూ, విషం కక్కవలసిన అవసరం ఏముందిナナ.ఈ మీడియాకీ, సో కాల్డ్ కాలమిష్టులకీ?
 దేశ ప్రజలందరూ సమానమే..అందులో జర్నలిస్టులు కొంచెం ఎక్కువ సమానమナナవాళ్లలో కూడా ఈ సో కాల్డ్ "లిబెరల్" జర్నలిస్టులుナナమరింత ఎక్కువ సమానం (ట.)
 ఆసలు వీళ్లు, కాంగ్రెస్ ఏమి చేస్తే బలపడుతుంది, ఎమి చేస్తే ఎక్కువ వోట్లు సంపాదిస్తుందీ, ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే బాగుపడుతుంది, ఆ అధ్యక్షుడూ, వాడి తైనాతీలు ఏమి చేస్తే పార్టీకి మంచిదిナナ.అంటూ ఉచిత సలహాలు పత్రికలనిండా ఎందుకు నింపుతారో?
 నిజమే, బలమైన ప్రతి పక్షం అవసరమే! దానికి ఓ అర్హత వుండాలికదా? అలాంటి అర్హత కోల్పోయి, అయినా బుధ్ధి తెచ్చుకోకుండా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ నే ఇంకా పట్టుకుని వ్రేళ్లాడాలనుకునే ఇలాంటి వాళ్లని, వుంటే గింటే, ఆ దేవుడే రక్షించాలి!
 నాకు ఇలాంటి మీడియానీ, జర్నలిస్టులనీ తలుచుకుంటే, జాలీ.ఇంకోటీ కలుగుతున్నాయి! అంతకంటే ఏమి చెయ్యగలను!

(మరింత మరోసారి)

No comments: