……….అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!
(వాళ్లకి అదే పని! …….తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు. ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలసిందల్లా……కొంతమంది మూర్ఖులైనా వాళ్లు వ్రాసినవి నమ్మకపోతారా, మరింత ప్రచారం చెయ్యకపోతారా…..అన్న వాళ్ల ఆశ ఒక్కటే!)
……..ఇంక, నిన్న బాబ్రీ మసీదు కూల్చివేత వార్షిక దినం. పైగా ఇది 25 వది అట! అందుకని దానికి ఘనంగా “రజతోత్సవం” అని ఈ పత్రికల వ్యవహారం!
ఇంక, అదేరోజు అంబేడ్కర్ పుట్టిన రోజో ఏదోట.
రెండింటికీ లింకు పెట్టి, వీళ్లంటారూ……”పాత విషయాలు అన్నీ మరిచిపోదాం…..” అని రాజ్యాంగంలో వ్రాసుకున్నాము ట. అందుకని, 1949 నుంచీ 1992 వరకూ జరిగిన విషయాలు మరిచిపోయి, మసీదు అక్కడే కట్టేసి, రాముడి గుడి బయటెక్కడో కట్టుకోవాలిట! ఇంకొందరు ప్రబుధ్ధులైతే, అక్కడ ఒక ఎమ్యూజ్మెంట్ పార్కో, థియేటరో కట్టాలట!
మరి, 1992 నుంచీ, 2010 వరకూ జరిగినవీ (అలహాబాద్ కోర్టు తీర్పూ…..) కూడా మరిచి పోవాలా? పోనీ, 2010 నుంచీ ఇప్పటివరకూ వీళ్లు జరుపుతున్న వార్షికోత్సవాలు మరిచిపోవాలా?
అసలు, మరిచిపోవడం అంటూ వస్తే, బాబర్ దండయాత్రా, ఆలయాన్ని కూలగొట్టి మసీదు నిర్మించడం వరకూ కూడా యెందుకు మరిచిపోకూడదు??? "మసీదు కట్టక ముందు అక్కడ రామాలయం ఉండేది" అని పురావస్తు శాఖ సమర్పించిన సాక్ష్యాధారాలు సుప్రీం కోర్టు దగ్గర వున్నాయి కదా మరి?
అవన్నీ వీళ్లకి అఖ్ఖరలేదు……రొడ్డకొట్టుడే వాళ్ల వ్యవహారం!
దీనికి తోడు, ఒకరోజు ముందు సుప్రీం కోర్టులో, ఇదివరకే ప్రకటించినట్టే, రోజువారీ విచారణ ప్రారంభం అయ్యింది.
ఆసలు సుప్రీం కోర్టు ఆ రోజుకి కేసు వాయిదా వేసింది, “……ఇక ముందు యే విధమైన వాయిదాలూ అనుమతించకుండా, రోజువారీ విచారణ సాగిస్తాము……” అని చెప్పి మరీ!
ఆసలు సుప్రీం కోర్టు ఆ రోజుకి కేసు వాయిదా వేసింది, “……ఇక ముందు యే విధమైన వాయిదాలూ అనుమతించకుండా, రోజువారీ విచారణ సాగిస్తాము……” అని చెప్పి మరీ!
మరి, తెలెవిమాలిన "కపిల్ సిబల్" వాదన చూడండి……”జులై 19, 2019 సంవత్సరం వరకూ కేసు వాయిదా వేయాలి” ట.
దానికి వాడు చెప్పిన కారణాలు……ముఖ్యమైనవి రెండు. 1. 2010 నుంచీ ఇప్పటిదాకా లేని ‘తొందర’ ఇప్పుడు ఎందుకు? 2. బీజేపీ వాళ్ల మేనిఫెస్టో లో, రామమందిరం నిర్మిస్తాము అని చెప్పారు. ఇప్పుడు రామ మందిరం నిర్మించేస్తే, 2019 లో బీజేపీ వాళ్లే గెలుస్తారు. (ఎవరు గెలిస్తే ఏమిటో వీడి బాధ? అవీ బయటికి వచ్చాయి……ఆ మర్నాడే! అది కూడా విచారణ చేయిస్తే “మనీ లాండరింగ్ కుంభకోణం" అంత విలువైన విషయాలు వెలికి వస్తాయేమో! ఈ విషయం గురించి తరువాత వ్రాస్తాను.)
1. కంగారెందుకు?......అన్నదానికి కోర్టే జవాబు చెప్పింది. “అప్పట్లో కేసు విచారణ 90 రోజులు మాత్రమే జరిగి ముగిసింది. ఆ ఆలస్యానికి కూడా కారణం, ఆ పార్టీలు ఏవో కారణాలతో వాయిదాలు కోరుతూ రావడమే” అనీ, “ఇప్పుడు పధ్ధతిప్రకారమే జురుగుతోంది కదా, ఇందులో తొందర ఏముంది?” అని అడిగింది!
మరి, తొందర విషయానికొస్తే, 1949 నుంచీ ఆ ప్రభుత్వాలు నానబెట్టడం ద్వారానే కదా ముడులు బిగిశాయి?
అప్పట్లో, యెలక్షన్ ల ముందు, శిలాన్యాసం చేసి, రాజీవ్ ఎందుకు తొందర పడ్డాడు?
అప్పట్లో, యెలక్షన్ ల ముందు, శిలాన్యాసం చేసి, రాజీవ్ ఎందుకు తొందర పడ్డాడు?
మసీదు కూల్చివేత తరువాత, పీవీ నరసింహారావు ని ఎందుకు హింసించారు? ఆయన సమాధికి కూడా ఢిల్లీలో స్థానం లేకుండా ఎందుకు చేశారు? అప్పటి నుంచీ కమిషన్లు వేసీ, కేసులు ఎందుకు దాఖలు చేయించారు? అవన్నీ ‘తొందర’ లేకుండానే చేయించారా? ఇప్పుడు తొందరేమొచ్చింది అని యే ముఖం పెట్టుకొని అడుగుతున్నారు?
2. “……వాళ్లు మందిరం కట్టేస్తే,…….వాళ్లే గెలుస్తారు!” అన్నది ఎంత మూర్ఖ వాదన!! వీళ్లకి కావలసింది సమస్య పరిష్కారం, జనం సుఖంగా జీవించడం కాదు! ఎలక్షన్ లలో వాళ్ల పార్టీ తప్ప ఇంకెవరూ గెలవకూడదు! వాళ్ల పిచ్చి పిచ్చి వ్యవహారాలూ, కుంభకోణాలే కొనసాగాలి!
ఉదాహరణకి, రేపు కాంగీలు తమ మేనిఫెస్టో లో, “2024 లోపల దేశం నుంచి దారిద్ర్యాన్ని పారద్రోలతాం” అని పెడితే, నాలాంటి వాడెవడో, “వాళ్లు తీసుకునే చర్యలేమిటో చెప్పకుండా, ఈ విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టడం రాజ్యాంగ విరుధ్ధం” అని కోర్టు కి వెళితే, “దాని మీద విచారణని 2024 వరకూ సాగించవద్దు. ఈ లోగా వాళ్లు నిజంగా పారద్రోలేస్తే, 2024 లో మళ్లీ వాళ్లే గెలిచేస్తారు” అని ఇంకో పార్టీ వాళ్లు వాదిస్తే……????
ఇలాంటివి మూర్ఖపు వాదనలు అనడానికి ఇంకేమైనా దృష్టాంతం కావాలా?
(మరింత మరోసారి)
No comments:
Post a Comment