దీనికి తెలుగులో మన 'పారిభాషిక భాషా పద కోశం' కూడా సరైన పదం ఇవ్వలేక పోయింది!
భాష పుట్టక క్రితమే, బ్యాంకింగ్ జరిగేదట! ఒక చెట్టు బెరడు మీద, అప్పు ఇచ్చిన వాడికి ఓ గుర్తూ, తీసుకున్నవాడికో గుర్తూ, తీసుకున్న మొత్తానికో గుర్తూ, తీర్చవలసిన గడువుకో గుర్తూ, ప్రతిఫలం యేమైనా అనుకుంటే దానికో గుర్తూ—ఇలా గుర్తులు వేసి, దాన్ని నిలువుగా సరిగ్గా సగానికి చీల్చి, ఋణ దాత దగ్గరోటీ, గ్రహీత దగ్గరోటీ పెట్టుకునేవారట—సాక్షికో గుర్తు తో సహా!
అదీ బ్యాంకింగుకి ఆది!
ఇకపోతే, మన తొలి తెలుగు నవల ‘రాజశేఖర చరిత్రం’ లో గానీ, తొలి తెలుగు నాటకం ‘కన్యాశుల్కం’ లో గానీ బ్యాంకుల ప్రసక్తి రాలేదు!
చిలకమర్తివారి గణపతిలో మాత్రం, వాళ్ళ తాత పునహా, సతారాల్లో (పెళ్ళికోసం) సంపాదించిన సొమ్ము ‘నారాయణ కర్ను’ గారి మీద ‘దర్శన హుండి’ వ్రాయించి తెచ్చుకున్నాడు గానీ, నారాయణ కర్ను గారిని బ్యాంకరు అని వ్రాయలేదు!
మన తొలి తెలుగు బ్యాంకరు శ్రీ భోగరాజు పట్టాభి శీతారామయ్య గారు సైతం, ఆంధ్రా బ్యాంక్, భారత లక్ష్మీ బ్యాంక్ అనే పెట్టారుగానీ, తెలుగు పదం సూచించలేదు!
గౌరవ తెలుగు పండితులెవరైనా, లేదా రీసెర్చ్ స్కాలర్లెవరైనా ఈ విషయం లో పరిశోధిస్తే, వాళ్ళకి డాక్టరేటు రావడమే కాదు—మనం కూడా సంతోషిస్తాం! అవునా?
పీ. ఎస్.:- మన తాతల కాలం లో వుంటూ వుండే ‘భోషాణం పెట్టె’ కన్నా పెద్ద బ్యాంకరు యెవరండీ?
7 comments:
ఖజానాగారము
నిధినిర్దేశిత
ద్రవ్యలావాదేవీసంస్థ
.
.
.
ఇలా చాలామందికి చాలా అలోచనలు రావచ్చు, కానీ వీటన్నింటికంటే బ్యాంక్ అంటేనే పామరులకు బాగా అర్థమౌతుందనుకుంటా!!
@ తెలుగు రాడికల్: బాంకింగు కి ఆది తెలియజేసినందుకు నెనరులు. :)
@భాస్కర రామి రెడ్డి: మీరు జరూరుగా వెంఠనే మన తెలుగు భాష ప్రోత్సాహక సమితిలో చేరాలి!
డియర్ భాస్కర రామి రెడ్డీ!
ఖజానా అంటే రాజుది, లేదా ప్రభుత్వానిది అయిన 'ట్రెజరీ'!
కోశాగారం అంటే, రాజులదీ, లేదా ప్రభుత్వ 'రిజర్వ్ బ్యాంక్'!
ఇక మిగిలినవి--'ధూమశకటాగమన........' అన్నట్టే వున్నాయి!
.
.
.
అవును కదూ! పామరులకే కాదు, పండితులకి కూడా!
లేకపోతే, మన జంధ్యాల అన్నట్టు "చతుశ్చక్ర శకట నివాస స్థానమూ అనగా 'బస్ స్టాండ్' అందురు! అదియునూ తెలియదు తమ బొంద!" లా వుంటుంది!
డియర్ నెటిజన్!
ధన్యవాదాలు!
రెడ్డిగారికి మీ ఆహ్వానం బాగుంది!
ఇక, 'నెనరులు ' అనేమాట 'జాలం' లో తఱచూ కనబడుతోంది! దీని వ్యుత్పత్తి అర్ధం యేమయి యుండనోపు?
@కృష్ణశ్రీ గారు, మీ వ్యాఖ్యానం బాగుందండి
@ నెటిజన్ గారూ, ఈ తెలుగు భాష ప్రోత్సాహక సమితి గురించి నేనెప్పుడూ వినలెదండి, వివరాలు చెప్పగలరా?
డియర్ భాస్కర రామి రెడ్డీ!
కొంతమందిలా కామెంట్ వ్రాశేసి, ఊరుకోకుండా, సమాధానాన్ని కూడా చదివినందుకూ, (తమ బొంద) అనకుందా అభినందించినందుకూ ధన్యవాదాలు!
కొనసాగించండి!
@భాస్కర రామి రెడ్డి: "ఈ తెలుగు భాష ప్రోత్సాహక సమితి గురించి నేనెప్పుడూ వినలెదండి." నేను కూడా నండీ.
:)
@Krishna Sree గారు కొంచెం ఓపిక చేసుకుని "నెనరులు" కొసం వెతకండి. మీరే నాకప్పుడు నెనరులు చెబుతారు. :)
Post a Comment