.....నా వ్యాఖ్యలు
4. పచ్చి నిజమే ఇది....కానీ, 'రాజీవ్......మ్యానిఫెస్టోలో.....' అంటూ మళ్లీ డబ్బా! అది వ్రాయించినవాడు పీవీయే అని వ్రాయరు!
ఆయన హయాం లోనే బాబ్రీ మసీదు కూలిందనే వంకతో, మైనారిటీల బుజ్జగింపులో భాగం గానే, ఢిల్లీలో ఆయన సమాధికీ, ఆయనకివ్వవలసిన గౌరవానికీ చెల్లుపెట్టి, ఆయన్నో 'అస్పృశ్యుడు' గా చూసినవాళ్లే, ఇప్పుడేదో ఓ మూలనించి 'ఆంధ్రుల ఆత్మగౌరవం' అని వినిపిస్తూంటే, రాజీవ్, అంజయ్యా ఙ్ఞాపకం వచ్చి, ఇప్పుడు ఆయన్ని కొంత పొగుడుతున్నారు!
ఆఫ్టరాల్, ఆయన వీళ్ల దృష్టిలో చేసిన తప్పు "రాజ్యాంగ బధ్ధంగా వ్యవహరించి" కళ్యాణ్ సింగుని తొలగించక పోవడమే!
జగజ్జీవనరామ్ నివసించిన 'భారీ బంగళా' ని ఇప్పుడుకూడా ఆయన కూతురు స్పీకర్ మీరాకుమార్ అధీనం లోనే (ఆవిడకి కేటాయించిన సువిశాల భవనానికి అదనం గా!) వుంచారు--దళితులని బుజ్జగించడానికి. అదే, పీవీ మరణించిన వెంటనే, ఆయన నివసించిన భవనం నించి ఆయన కుమారుణ్ణి తన్ని తగిలేసి వెళ్లగొట్టారు!
అదీ.....ఈ కాంగీల సంస్కృతి!
మిగతా మరోసారి.
2 comments:
మాస్టారు,
మీరు కాంగీల గురించి అన్ని నిజాలే మాట్లాడు తున్నారు. కొంచెం జాగ్రత్త. Anti-national and anti-Hindu and most corrupt కాంగీలు ఏమైనా చెయగలరు.
:)
బాబూ! నాకా భయం లేదు.
ఓ బృహద్జాతక 'నిర్ధారక' సామ్రాట్ వ్రాసిన నా జాతకం ప్రకారం నాకు మారకం 2072 వ సంవత్సరం లో! (ఇప్పుడాయనా లేడు....నా జాతకం ప్రతి వెతికినా దొరుకుతుందోలేదో!)
రాజేష్ జి(ల)గాడూ, వాడి తైనాతీ అన్నోనూ, 'అన్నీ మూసుకో' అన్నప్పుడు ఈ మాట వ్రాద్దామనుకొన్నాను కానీ అవకాశం చిక్కలేదు. (నేను నమ్మని ఈ జాతకాలని వాడిలాంటివాళ్లు నమ్మవలసిందే కదా మరి?)
అయినా, ఇంకెన్నాళ్లు యెవరిని వుధ్ధరించాలి నేను?! చూద్దాం!
ధన్యవాదాలు.
Post a Comment