కొన్ని నిజాలు
యేమాటకామాటే చెప్పుకోవాలి! పాపం ఇందిరాగాంధీ మనిషి చాలా మంచిదే (గుణమే.....అని నేననలేదండోయ్!).
ఆంధ్ర ప్రదేశ్ గురించి ఆవిడ అభిప్రాయాలు చూడండి......
"వేలాది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ విభిన్న సంస్కృతుల కేంద్రంగా విలసిల్లింది. రాష్ట్రంలో నేడున్న అన్ని ప్రాంతాలు చరిత్రలో చాలాకాలంగా ఒకే గొడుగు కింద ఉన్నాయి. తెలుగు ప్రజలు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దశాబ్దాలుగా పోరాడటానికి ఈ సుదీర్ఘచరిత్రే కారణం కావొచ్చు."
"భాషా ప్రయుక్త రాష్ ట్రాల అంశం జాతీయోద్యమంలో ఓ భాగమనేది వాస్తవం. దీన్ని విస్మరించలేం. ప్రస్తుతం మనుగడలో ఉన్న ప్రతి ప్రాంతం ఒకప్పుడు భాషా ప్రాతిపదికన ఏర్పడినదే. వివిధ రాష్ట్రాల ఏర్పాటులో విస్తృతమైన హేతుబధ్ధత ఉంది. క్షణికావేశంలో ఈ పునాదికి బీటలు పడకుండా చాలా జాగ్రత్తగా వుండాలి."
"సమైక్య రాష్ ట్రానికే నేను కట్టుబడి ఉన్నాను. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయన్నది ఇక్కడ అంశం కాదు. మీరు ఎవరో ఒకరికి పొరుగువారిగానే వ్యవహరించాలి. అనేక అంశాల్లో పరస్పరం పరిష్కరించుకోవాలి. విడిపోవడం ద్వారా ఈ ప్రజలను మనం వదిలించుకున్నామనో...లేదా సమస్య నుంచి తప్పించుకున్నామనో అనుకోవడం చాలా తప్పుడు అభిప్రాయం. అది మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్న నిజం!"
ఇలా నిష్కర్షగా తన అభిప్రాయాన్ని యెందుకు చెప్పదు కాంగీ (సోనియా) పార్టీ?!
1973 లో ప్రత్యేక ఆంధ్రోద్యమం చివరి రోజుల్లోనో, రాష్ ట్రం లో రాష్ట్రపతి పాలన విధించాకో ఆవిడ చెప్పిన పై మాటలు సహజంగా యువకులమైన మాకు యేమాత్రం రుచించలేదు....నచ్చలేదు!
ఇప్పుడు వింటే, యెంతబాగా చెప్పిందో! అనిపిస్తుంది.
ఇప్పటి యువత సంగతీ, ఓ పాతికేళ్ల తరవాత ఇంతే అంటే కాదంటారా?
11 comments:
బావున్నాయండీ మీ ఆంధ్రోద్యమ కబుర్లు. మీరు ’రాష్ ట్రం’ అని కావాలనే వ్రాస్తున్నారా? లేక అచ్చు తప్పా?
డియర్ పండు!
అవును....కావాలనే 'వ్రాయవలసి' వస్తోంది....అచ్చు తప్పే!.....లేఖిని వారి తప్పు!
వారు సవరిస్తారనే భావిద్దాం!
ధన్యవాదాలు.
రాష్ట్రం
నాకు లేఖిని బాగానే పనిచేస్తున్నదే!
raashTram
నిజమే
ఇందిరా గాంధీకి వున్న తెగింపు ఆమె తండ్రి నెహ్రూకి లేవు ... కోడలు సోనియాకీ లేవు.
ఎందుకంటే
ఇందిరాగాంధీ ౧౯౬౯ లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ప్రత్యెక తెలంగాణా ఉద్యమాన్ని ఒక్కు పాదంతో అణిచి
వేసింది. తెలంగాణా లో రక్తపు తేరులు పారించి, అప్పటి తెలంగాణా ప్రజా సమితి నేతలను నయానో భయానో లొంగ దీసుకుని
ఉద్యమం నడుము విరగ్గొట్టి రాష్ట్రాన్ని బలవంతంగా సమైక్యంగా కొనసాగేట్టు చేసింది
అదే ఆమె తండ్రి నెహ్రూ పైకి ప్రజా స్వామ్యం, సామ్యవాదం అనే వాడే కానీ ఆచరణలో అందుకు విరుద్ధమైన పనులకు
ఆస్కారం ఇచ్చేవాడు.
తెలంగాణాను తనలో విలీనం చేసుకోవాలన్న ఆంద్ర అత్యుత్సాహం లో
సామ్రాజ్య వాద పోకడలు దాగి వున్నాయని నేహ్రూయే చెప్పాడు. ...
" తెలంగాణా అనే ఒక అమాయక వధువును ... ఆంద్ర అనే ఒక ఆరితేరిన గడుసరి వరుడికి ఇచ్చి
పెళ్లి చేయడం తగదని, ఈ సంసారం ఎక్కువ కాలం సాగక పోవచ్చని" ఆయనే వాపోయాడు.
కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీలు కావాలని ఆయనకు స్పష్టంగా తెలుసు.
అలా అంటూనే చేజేతులా ఒత్తిళ్లకు లొంగి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు ఫైలు మీద (1956 ) సంతకం చేసాడు.
తన కాళ్ళ ముందే పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘనకు గురవుతుంటే నిర్లిప్తంగా వుడి పోయాడు.
అట్లాగే
ఇక సోనియా గాంధీ సంగతి
2004 లోనే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు పచ్చ జండా ఊపింది.
మానిఫెస్టోలో పెట్టి తెలంగాణా ప్రజలకు హామీ ఇచ్చింది. టీ ఆర్ ఎస్ తో పొట్టు పెట్టుకోవడమే కాక
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆ పార్టీకి సముచిత స్థానం కల్పించింది.
కామన్ మినిమం ప్రోగ్రాం లో పెట్టి ప్రధాన మంత్రి మన్మోహన్ చేత , రాష్ట్ర ప్రతి అబ్దుల్ కలాం చేత
పార్లమెంటులో ప్రగల్భాలు పలికించింది.
ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసి ఆర్భాటం చేసింది.
చివరికి 2009 డిసెంబర్ 9 న తెలంగాణా ప్రక్రియ ప్రారంభిస్తున్నామహో అంటూ
హొం మంత్రి చిదంబరం చేత ఉభయ సభల్లో దండోరా కూడా వేయించింది.
ఆయినా ఆంద్ర నేతలు రాత్రికి రాత్రే ప్లేటు ఫిరాయించి రాజీనామా అస్త్రం ప్రయోగించాగానే
హడలి పోయి వెనక్కి తగ్గింది.
ఈ విధంగా తండ్రీ కూతురూ కోడలూ అందరూ తెలంగాణాకి అన్యాయమే చేసారు.
డియర్ శరత్!
నాకూ మీలాగానే లేఖిని 'బాగానే' పని చేస్తూంది. యెటొచ్చీ, తెలుగు రాష్ట్రంలో 'రా వొత్తు ' వుందనే వూహించవలసి వస్తోంది. అలాగే 'పధ్ధతి ' లో యెలా వ్రాసినా, 'వొత్తు ' కనిపించదు.
ప్రయత్నిస్తే, సాధ్యమవచ్చు అని నా సూచన మాత్రమే!
ధన్యవాదాలు.
డియర్ Goutham Navayan!
1969 లో 'రక్తపుటేరులు పారించింది' ఇందిర కాదు--తె ప్ర స నాయకులే! అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, అప్పటి రాజకీయ నిరుద్యోగి చెన్నారెడ్డీ, బద్రీ విశాల్ పిట్టీ, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీల మీద సానుభూతి వొలకబోస్తున్న కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రభుత్వ ఎన్ జీ వో ల నాయకుడు కే ఆర్ ఆమోస్.....వగైరాలే!
అప్పట్లో బలయిన వాళ్లు కూడా, విద్యార్థులే--ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలే! (గణాంకాలు నన్నడగవద్దు. ఒస్మానియా యూనివర్సిటీ రికార్డుల్లోనో, యెక్కడో వెతుక్కోండి--దొరక్కపోవు. యెందుకంటే, అప్పట్లో సరదాకి హైదరాబాదు వచ్చి, ఓ 'సైకిల్ టాక్సీ' పై రోడ్లు చుడుతున్న అనుభవం నాది!)
ఆ రోజుల్లో, చాదర్ ఘాట్ బ్రిడ్జ్ సన్నంగానే వుండేది. రెండో బ్రిడ్జ్ లేదు. ఓ టెలిఫోన్ పోల్ ని వూడదీసి, ఆ బ్రిడ్జ్ కి ఇరువైపులా వుండే ఇనుప కానాల్లో దోపేస్తే, ట్రాఫిక్ నిలిచి పోయేది! కోఠీ వైపు పోలీసులుంటే, కమల్ టాకీసు వైపూ, అటు పోలీసులుంటే, కోఠీ వైపూ, దౌర్జన్యకాండ సాగించేవారు....ఆగిన బస్సులలో వున్నది తమ తెలంగాణా సోదర, సోదరీమణులే అయినా, రాళ్లతో కొట్టీ, అందరూ పారిపోయాక వాటిని తగలెట్టీ, ఈ లోపల పోలీసులు నయాపుల్ మీదనించి వచ్చి ఫైరింగు చేస్తే, కొందరు బలయీ......ఇలా జరిగేది! (నెత్తురుటేరులు పారింది ఆ ప్రాంతాల్లోనే!)
'నయానో, భయానో' కాదు--వాడి స్వార్థానికి గేలం వేసి! తరవాత ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి, 'చందారెడ్డిగా' ప్రఖ్యాతుడై, పెద్దమనుషుల వొప్పందాన్నీ, ఇందిర పథకాలనీ యెంతబాగా అమలు చేశాడో అందరికీ తెలుసు.
నెహ్రూ 'తెలంగాణా అనే ఒక......' యెక్కడినించి సేకరించారో, అధికారిక సమాచారం (ఓ లింకుగానీ, పుస్తకం గానీ) ఇస్తే సంతోషిస్తాను.
సోనియా చేస్తున్నది 'పచ్చి రాజకీయం'! వాళ్ల పార్టీ, దాని విజయమే ఆవిడ పరమావధి! అర్థం చేసుకోలేని కే సీ ఆర్ అనేక సార్లు మోసపోయాడు. ఇప్పుడైనా, వాడి పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోవడమే ఆవిడ లక్ష్యం! (మోసపోయెవాళ్లు ఇప్పటి తెలంగాణా ఎంపీలూ, ఎమ్మెల్యేలూ--బలయ్యేది అన్నెం పున్నెం యెరుగని విద్యార్థులే!)
అవీ తండ్రీ, కూతురూ, కోడలూ ఆంతర్యాలు.
ధన్యవాదాలు.
కృష్ణశ్రీ గారు, మీరు చెప్పింది కట్టుకథ. మేం నమ్మం. మీరు హైద్రాబాద్లో ఆ టైంలో వున్నట్లు ౠజువులేమైనా వున్నాయా? లేకుంటే, మేం చెప్పిందే నిజం. దోచింది చాలు, ఇకనైనా తెలంగాణ ఇవ్వాల్సిందే.
>>>> నెహ్రూ 'తెలంగాణా అనే ఒక......' యెక్కడినించి సేకరించారో, అధికారిక సమాచారం (ఓ లింకుగానీ, పుస్తకం గానీ) ఇస్తే సంతోషిస్తాను.
>>>
అంట వెటకారం అవసరం లేదు. 1956 లో నిజామాబాద్ లో జరిగిన ఒక బహిరంగ సభలో నెహ్రు chesina ఉపన్యాసం లోనివి.
ఈ కింది వీడియోలో ఆయన కంటస్వరం లో వినండి.
http://www.youtube.com/watch?v=Xl6kdniXVSE
>>>>1969 లో 'రక్తపుటేరులు పారించింది' ఇందిర కాదు--తె ప్ర స నాయకులే!
>>>> ఇప్పుడైనా, వాడి పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోవడమే ఆవిడ లక్ష్యం!
ఇంత గొప్ప అభిప్రాయాలున్న మీతో వాదన వృధాయే
పై అన్నోన్!
"....మేం నమ్మం...." అంటే అప్పీలే లేదు. యెవరో అన్నట్టు, మనుషులంతా 'తింగరి' వాళ్లే....యెటొచ్చీ మన తింగరితనం బయటపడకుండా ప్రవర్తించడం లోనే వుంది గొప్పతనం.
క్రిమినల్ కేసుల్లో కూడా, ప్రత్యక్ష సాక్షి చెప్పినదానికి, ప్రతికక్షి లాయరు కూడా, "ఆ సమయం లో మీరు అక్కడెందుకు వున్నారు, అక్కడ మీకేం పని, చూసింది వాళ్లనే అని అంత ఖచ్చితంగా యెలా చెప్పగలరు...." ఇలా ప్రశ్నిస్తాడే గానీ, "మీరక్కడున్నట్టు ఋజువు చూపించండి" అనడు. అంటే, వాడి న్యాయ శాస్త్ర పరిఙ్ఞానం బయటపడుతుంది! ఆ ప్రశ్నలకి నేను ముందే జవాబు ఇచ్చా....'రోడ్లు చుడుతున్న....' అని.
మీరు ఇవాళ ఇలా అడుగుతారని నేను అప్పుడే కలగని వుంటే, ఋజువులు జాగ్రత్తపెట్టేవాణ్ణి!
ఇంకో సంగతి మరిచాను--ఆప్పటి వుద్యమంలో మహమ్మదీయులెవరూ దాదాపు పాల్గోలేదు!
ఇంక దోచిందెవరో, బాగుపడ్డదెవరో శ్రీకృష్ణ కమిటీ వివరంగా చెప్పినా, చాలామందికి ఇంకా బుధ్ధి రాలేదు (ముఖ్యంగా కేకే కి--ముగ్గురు మూర్ఖుల్లో వీడొకడే బాగా రెచ్చిపోతున్నాడు). "అవన్నీ మాకనవసరం.....మాక్కావలసింది 'ఐదో' పరిష్కారమే" అని యెందుకు అంటున్నారు మీ నాయకులు?
ఇకనైనా నిజాలు తెలుసుకోండి.
డియర్ Goutham Navayan!
నాకు చిన్నప్పణ్ణించీ నేను చూడని, చదవని విషయాలేమైనా వింటే, వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలని అవి తెలుసున్నవాళ్లని అడగడం, పుస్తకాలు సంపాదించి చదవడం అలవాటు. నా ప్రశ్నలో 'వెటకారం' వినిపిస్తే, అది నా తప్పుకాదు (అయినా ఈ మధ్య బ్లాగులోకంలో యెవరేమన్నా అది వెటకారమే అనుకొని ఫీలయిపోవడం ఫేషన్ అయినట్టుంది!)
నెహ్రూ స్పీచెస్--ట్రైస్ట్ విత్ డెస్టినీ, టెంపుల్స్ ఆఫ్ ది న్యూ యేజ్--లాంటివి మా పాఠ్య పుస్తకాల్లోనే కాకుండా, షార్ట్ హేండ్ నేర్చుకొనేటప్పుడు డిక్టేషన్లు తీసుకున్నవాళ్లం మేము. దాదాపు అన్ని స్పీచెస్ చదివాం మేము. ఆయన 'లెటర్స్ టు ఏ డాటర్' కూడా చదివాము.
మీరిచ్చిన లింకు 'అధికారిక' సమాచారం కాదు.....యెవరో తీసి, 'వీడియో' ఎంబెడ్ చేసినది. సరే, అదైనా వొప్పుకుందామా అంటే, అర్థసత్యాలూ, సత్యాన్ని వక్రీకరించడాలూ అంటే అవే అని తెలుస్తుంది. మీరే మరోసారి చూసి, వినండి--"ఆంధ్రా, తెలంగాణాలని......." అని, "మాసూం లడ్కీ....నట్ ఖట్ లడ్కా....." అంటే, (మొదట చెప్పిన) ఆంధ్రా మాసూం...అనీ, తెలంగాణా నట్ ఖట్.....అనీ ఆయన వుద్దేశ్యం. యెందుకంటే, అప్పటికి రజాకార్లు దేశం విడిచిపోయినా, నిజాం పరిపాలనలో బలపడిన జాగీర్దారులూ, దేశముఖ్ లూ, దొరలూ తమ ప్రైవేటు సైన్యాలతో ఆ ప్రాంతాలని పాలిస్తున్నారు!
'రక్తపుటేరులు....' గురించి దైవకృపతో ఇంకా బ్రతికే వున్న కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆమోస్ లనే అక్ఖర్లేదు....అప్పటినించీ ఇప్పటివరకూ హైదరాబాదులోనే నివసిస్తున్నవాళ్లని అడిగినా, చాదర్ ఘాట్ బ్రిడ్జ్ ని పాత సినిమాల్లో చూసినా మీకు అర్థం అవుతుంది.
మరి, "తెలంగాణా ఇచ్చేస్తే, కాంగ్రెస్ లో విలీనం అవడానికి మేము రెడీ" అని కేసీఆర్ ప్రకటించడం యెందుకు? 'ఆయనే వుంటే....'అన్నట్టు సోనియా దానికి వొప్పుకోకపోవడం యెందుకు? ఆలోచించండి.
నా బ్లాగులోకొచ్చి, ఇంతవరకూ యెలాగూ వాదించారు కాబట్టి, నావాదన కూడా విని, అప్పుడు విరమించండి!
ధన్యవాదాలు.
Post a Comment