Thursday, September 1, 2011

"విగ్నేస్వర.....



.....సుబాకాంక్సలు!"

"అందరికీ వినాయక చతుర్దశి షుభాకాంక్షలు!"

ఇప్పుడే, ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోడానికి, జోరుగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెఖ్ఖచెయ్యకుండా వచ్చిన ఓ మహిళ ఓ టీవీ ఛానెల్లో చెప్పిన మాట!

ఈ లండాచోరీ అంతా మనకు తెలియని, రాని, చదవని, వ్రాయలేని "సంస్కృతం" వల్లే అని వొప్పుకుంటారా?

శుభ్రంగా "వినాయక చవితి" అనకుండా, "చతుర్థి" అనబోయి, "చతుర్దశి" అనడం యెందుకు?

తెలుగుభాషా పండితులూ....వెయ్యేళ్ల తెలుగు వారూ!....మీడియావాళ్లు చక్కని తెలుగునే మాట్లాడి, ప్రసారం చేసేలా కృషి చేస్తారా?

మీ యిష్టం మరి!

4 comments:

Dr.Suryanarayana Vulimiri said...

కృష్ణశ్రీ గారూ, వినాయక చవితి శుభాకాంక్షలు

భాస్కర రామిరెడ్డి said...

కృష్ణశ్రీ గారూ, మీ సెటైర్ బాగానే వుంది కానీ, మీ పోస్టు చదివాక నాకొక సందేహమొచ్చింది. తీర్చుతారా? ఇంతకీ శుభాకాంక్షల ను తెలుగులో ఏమంటారండీ?

A K Sastry said...

డియర్ వులిమిరివారూ!

చాలా సంతోషం. ధన్యవాదాలు. మీక్కూడా.......లు!

("పత్రి" పై మీ టపా చాలా బాగుంది.)

A K Sastry said...

డియర్ భాస్కర రామి రెడ్డి!

ముందు మీ సందేహం అర్థం కాలేదు. మీ వుద్దేశ్యం అది సంస్కృతం మాట అని అయి వుండొచ్చు అనిపించింది. అవునా?

చివర ప్రథమా విభక్తి వుంది కాబట్టి అది ఖచ్చితంగా తెలుగు మాటే అంటాను నేను.

ధన్యవాదాలు.