డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా!
గాలిని బంధించగలమా?
అదే సాధ్యమైతే, మన పూర్వ ఋషులు, అగస్థ్యుడో యెవరో సముద్రాన్ని తన కమండలంలో బంధించినట్టు, గాలిని కూడా బంధించి చూపించేవారే! తనంతటతాను వాయుదేవుడు స్థంభించిన దాఖలాలు మాత్రం వున్నాయి కొన్ని కథల్లో. అంతే.
గాలిని మనం బుడగల్లో బంధించి, బుడగనో, దాని మూతిని దారాంతోనో, ముడేసి, "ఆహా! గాలిని బంధించాం" అని ఆనందిస్తాం ! కానీ యెంతగట్టిగా ముడేసినా, తెల్లారి చూసేసరికి, చాలామటుకు గాలి అందులోంచి నిష్ క్రమించేసి వుంటుంది!
సరే....ఇలాంటి సరదా విషయాలు ప్రక్కన పెడితే, గాలి జనార్దన రెడ్డి ని సీబీఐ వారు "బంధించగలిగారు". యెలా? అనేక డ్రామాల తరవాత!
అంత అవసరమా అంటాను నేను.
నా ప్రశ్న వొక్కటే....జేడీ లక్ష్మీనారాయణకి "గాలిని అరెస్టు చెయ్యమని" ఆయన పై అధికారుల్లో యెవరు ఆదేశాలు ఇచ్చారు? ఒకవేళ ఆదేశించి వుంటే, ఆ ఆదేశం "చట్టబధ్ధమేనా"?
(తొందరపడి నాది వితండవాదం అనెయ్యకండి. టపా పూర్తిగా చదివాక మాత్రమే అలాంటి వ్యాఖ అవసరమేమో ఆలోచించండి.)
జేడీ కి రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన ఒక వుద్యోగి మాత్రమే! ఆయన కూడా ఆవిషయం మొన్ననే ప్రకటించవలసి వచ్చింది. వొప్పుకొంటారుగా? మరి ఆయనకి పై అధికారులూ వుంటారుగా?
జేమ్‌స్ బాండ్ కథల్లో సైతం, ఆయనని పిలిచి, వాళ్ల బాస్ "ఎమ్" ఫలానా కేసు పరిశోధించు. దానికోసం నీకు ఫలానా అధికారాలు ఇస్తున్నాము--అని కేసు అప్పగిస్తారు. కానీ బాండ్, తానే వెళ్లి ఫలానా పని చేస్తాను, మీరు అనుమతి ఇవ్వండి అని అడగడు!
మనదేశంలో యెమర్జన్సీ విధింపుకి ముందు, లోక్ నాయక్ జేపీ పోలీసులకి "చట్టవిరుధ్ధమైన ఆదేశాల అమలుకి తిరస్కరించండి" అని పిలుపు ఇచ్చాడు. దాంతోనే, ఆయన పోలీసులని "తిరుగుబాటు" చెయ్యమంటున్నాడు అనే వంకతో యెమర్జన్సీ విధింపు, తరవాత అరెస్టులూ జరిగాయి. అదంతా చరిత్ర.
వుద్యోగులు చెయ్యవలసింది, తమకిచ్చే జీతానికి సరిపడా, పనివేళల్లో, తమ వుద్యోగ నిబంధనలని అనుసరించి, విధి నిర్వహణ చెయ్యడమే!
"పావలా తీసుకొని, రూపాయి ఏక్షన్ చేసేస్తున్నాడు చూడండ్రా!" అంటారు సినిమా చూస్తూ. అలా చెయ్యాల్సిన అవసరం వుందా అంటారు అలా అనేవాళ్లు.
బ్యాంకులలో కూడా "విజిలెన్స్" విభాగాలుంటాయి. దాంట్లోకి కొంతమంది వుద్యోగులని బదిలీ చేస్తారు. అలాంటి కొందరు "జేయెమ్‌వన్"గాళ్లు--తమ పై అధికారులు--వుద్యోగి యెవరిమీదైనా ఫలానా విషయంలో "దర్యాప్తు" చెయ్యమంటే, వాళ్లు ఆ వుద్యోగుల ఇళ్లకి వెళ్లి, వాళ్ల ఆడవాళ్లనీ, పెద్దలనీ, పిల్లలనీ--మీవాడు తప్పు చేశాడు....మీరు నిజం చెప్పకపోతే, చాలా దూరం వెళుతుంది.....మేము సీ ఐ డీ నుంచి వచ్చాము. నేను డీ ఎస్ పీ రాంక్ వాడిని. "నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు" జారీ చేసేందుకు నాకు అధికారాలు వున్నాయి.....అంటూ బెదిరించి వాళ్లదగ్గర వీళ్లకి కావలసినట్టు వాఙ్ఞ్మూలాలు సంతకాలు పెట్టించేసుకునేవారు ఆ దౌర్భాగ్యులు! ఆ వుద్యోగి వీళ్లకన్న పెద్ద స్థాయి వాడు--యే స్కేల్ మూడో, నాలుగో అయినా సరే--వీళ్లే దర్యాప్తులు!
అదీ పావలా తీసుకొని, రూపాయి ఏక్షన్ చెయ్యడం అంటే!
తరవాత ఎంక్వైరీలో డిఫెన్సువాళ్లు వాటిని అన్నీ ఖండ ఖండాలు చేసేసినా, ఎంక్వైరీ ఆఫీసర్లు (వీళ్లకి ప్రత్యేక ఆదేశాలుంటాయి) "గిల్టీ" అని తీర్పు ఇచ్చేస్తారు!
పైగా, ఆ కేసులు వాదించిన విజిలెన్స్ విభాగం జేయెమ్‌వన్‌గాళ్లు--నేను చేపట్టిన కేసులన్నింటిలోనూ, అందరికీ శిక్షలు పడ్డాయి, యెవరూ తప్పించుకోలేదు--అని బోర విరుచుకునేవాళ్లు!
ఇలా వుంటాయి ప్రహసనాలు!
......మరోసారి.
2 comments:
chalabagundi galini guppetalo muyyaleru evvaru arachetto jaganamohananni chudakunda cehyyaleru veeri pitchi kakapothe
డియర్ cheruvu nageswara prasad!
మీరు యేవుద్దేశ్యంతో వ్రాశారోగానీ, బాగానే వ్రాశారు!
ధన్యవాదాలు.
Post a Comment