Wednesday, January 5, 2011

కాంగీ పార్టీ - 3

.....నా వ్యాఖ్యలు

తన అత్తగారు పెద్ద పత్తిత్తు అనీ, నాటి ఘోరాలు--విద్యార్థి రాజన్ హత్య, స్నేహలతారెడ్డి కేసు వగైరాలన్నింటికీ--సంజయ్ నే బాధ్యుడు అని ఇప్పుడు ఈ పుస్తకంలో తేల్చింది సోనియా!

మరి, నవీన్ చావ్లాలూ, ఆర్ కే (వె)ధావన్ లూ, ఆవిడ అండలేకుండానే చెలరేగిపోయారా?

మన దేశం లో ఎమర్జెన్సీ అనే చీకటి యుగానికి బాధ్యురాలు కేవలం ఇందిరా గాంధీ మాత్రమే!

3. "మిస్టర్ క్లీన్" గా అభివర్ణించబడిన రాజీవ్ గాంధీ, 'వ్యవస్థ ప్రక్షాళనకి' వుపక్రమిస్తే, కొంతమంది 'అధికార దళారులు'; కాంగ్రెస్ 'వృధ్ధ నాయకులు' అడ్డు పడ్డారట.

తన చుట్టూ యువ రక్తాన్ని నింపుకొంటున్నాననుకొని, యెవరు యే సలహా ఇస్తే దాన్ని ఆలోచనలేకుండా పాటించి, శిలాన్యాస్ లాంటి వేషాలు వెయ్యడమేకాకుండా, భార్యా బంధం తో, ఖత్రొచీని తన కార్యాలయం నుంచే కార్యకలాపాలు సాగించనిచ్చి, బోఫోర్స్ కుంభకోణం లో పీకలమొయ్యా కూరుకు పోయాడు. సంస్కరణల విషయం లో బొక్క బోర్లా పడ్డాడు! దానికి తోడు, శ్రీలంకలో ఐపీకేయెఫ్ అనే ఓ వెర్రి ప్రయోగం వొకటి! అందుకే బలయి పోయాడు.

మిగతా మరోసారి.

8 comments:

Anonymous said...

సొనియా వాటికన్ స్పై అని చెపుతారు. కిరస్తానీ ఎజెండాను పూర్తి చెయాడానికి నియమించబడ్డది అని చెపుతారు.

21 వ శతాబ్ధములొ, కిరస్తానీలకు, ~ 1.0 బిలియన్ హిందువులు, మరియు ~ 1.3 చైనా బుద్దులు ఒక టార్గెట్.

A K Sastry said...

1st Commentor!

వాటికన్ సంగతి నాకు తెలీదు గానీ, మార్కోపోలో దగ్గరనించి, కొలంబస్, కెప్టెన్ కుక్, కెప్టెన్ స్కాట్, వాస్కో డ గామా వరకూ, వాళ్లు కనిపెట్టిన మార్గాలలో ప్రయాణించి, క్రైస్తవ మత ప్రచారకులు కొన్ని వందల సంవత్సరాలుగా మత ప్రచారం సాగిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. ప్రణాళికాబధ్ధం గా వాళ్లాపని చేస్తున్నారన్నదీ నిజం.

"హిందువులందరూ ఖాండ్రించి....." అన్నట్టు......యెవడో ఓ పిచ్చి పని చేస్తే, దానికి 'కాషాయ వుగ్రవాదం' లాంటి పెద్ద పేర్లు పెట్టేసినవాళ్లకీ తెలుసు....మనం మన లాలాజలం మింగేస్తామంతే.....అని!

వాళ్లకి తెలియచెప్పాల్సిన సమయం వచ్చిందంటారా?

మీరే చెప్పండి.

veera murthy (satya) said...

సమాజ శ్రేయస్సుకి ఉచితంగా అందాల్సినవి రెండు ...కనీస విద్య, కనీస వైధ్యం...కానీ ఇప్పుడు అవే పేరెన్నికగన్న లాభసాటి వ్యాపారాలు!

ఆ రెండింటినే వారు ఉచితంగా అందిస్తామన్న ఆశ చూపి మతమార్పిడులకి పాల్పడతారు....సమాజం లోని అసమానతలని అవకాశంగా మల్చుకుంటారు.

Anonymous said...

గురువు గారు,

ఈ దిగువన ఇచ్చిన స్టేట్మెంన్ట్ లొ ఏమైనా నిజం వుందా చెప్ప గలరు.

"The West became prosperous by artificially manipulating the exchange parity of currencies".

A K Sastry said...

డియర్ satya!

మీరన్నది నిజం. అవి ఇప్పుడే లాభసాటి వ్యాపారాలు కాదు.

ఓ వందేళ్ల క్రితం, ఆ తరవాతా, డచ్చివాళ్ల పరిపాలనలో వున్న నరసాపురం లాంటి గ్రామాలలో, "గోదావరి డెల్టా మిషన్" ని స్థాపించి, విస్తరించి, పాఠశాలలూ, మిషన్ హాస్పిటళ్లూ నెలకొల్పి, విద్య, వైద్యాలు అందించిన అనేకమంది మదర్ థెరీసాలూ, ఫాదర్ ఫ్రెడ్రిక్ లూ--అనేక కష్ట నష్టాలకోర్చి చేసిన కృషి ఫలితంగానూ, అగ్రవర్ణాలవాళ్లు హైదరాబాదు, ముంబాయి, బెంగుళూరు, చెన్నై, అమెరికాలకి వెళ్లిపోవడం తోనూ, మత వ్యాప్తి జరిగి, ముఖ్యమైన పేటలన్నీ వాళ్ల మత మయం అయిపోయాయంటే--యెవరిది తప్పు?

వాళ్లు మైక్ లు పెట్టుకొని బోధలు చేస్తుంటే, అంతకన్నా పెద్ద స్పీకర్లలో వెర్రిపాటలు వేసుకొంటున్న మన గుళ్లవారిదా? రకరకాల పూజల్నీ, వుత్సవాలనీ ప్రవేశపెట్టి......యెందుకులెండి!

ధన్యవాదాలు.

A K Sastry said...

పై అన్నోన్!

అది ఓ పెద్ద సబ్జెక్ట్. బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్; ట్రేడ్ డెఫిషిట్స్; ఎక్స్ టర్నల్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్, బైలేటరల్ గ్రూప్; డీ మోనెటైజేషన్; ఇలా చాలా వున్నాయి చెప్పాలంటే!

ప్రస్తుతానికి, 1960 ల్లో మన దేశం (ఇందిరాగాంధీ) అంతర్జాతీయ వొత్తిళ్లకి లోబడి, ఒకసారి మన రూపాయి "విలువ తగ్గించింది".

తరవాతోసారి, డీ మానెటైజ్ చేశారు.

ఆ కొటేషన్ దాదాపు నిజమే!

వివరంగా మరోసారి వ్రాస్తాను (మీరూ, మీలాంటివాళ్లూ వ్రాయమంటే).

ధన్యవాదాలు.

veera murthy (satya) said...

కృష్ణశ్రీ గారు మీకు కూడా ధన్యవాదాలు.

Unknown said...

డియర్ satya!

సంతోషం.